సీపీగెట్, ఎడ్సెట్ ప్రవేశాలకు డిగ్రీ పూర్తైన విద్యార్థులకు జూమ్ యాప్ వేదికగా ఉచిత తరగతులను నిర్వహిస్తున్నట్లు ప్రముఖ విద్యావేత్త మోదాల మల్లేష్ తెలిపారు. ఎడెసెట్ బయలాజికల్ సైన్సెస్, కామన్ పోస్టు గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్టు(సీపీగెట్)లోని ఎంఎస్సీ జువాలజీ, బయోకెమిస్ట్రీ, మెక్రోబయాలజీ, జెనిటిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్ సబ్జెక్టులకు ఆన్లైన్ వేదికగా పాఠాలు బోధించనున్నట్లు వెల్లడించారు. ఈమేరకు ఉచిత తరగతులు వినేందుకు రిజిస్ట్రేషన్, తదితర వివరాల కోసం 9989535675 ను వాట్సాప్ ద్వారా సంప్రదించగలరని కోరారు.
'కరోనా నేపథ్యంలో డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు సమయం వృథా కాకుండా ప్రవేశపరీక్షలపై దృషి సారించాలి. విద్యార్థులకు ఉపయోగపడేలా ఉచితంగా పాఠాలు బోధించేందుకు నిర్ణయం తీసుకున్నాం. పీజీ, ఎడ్సెట్ ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించే దిశగా శిక్షణ ఇస్తాం'- మోదాల మల్లేశ్, ప్రముఖ విద్యావేత్త