కార్యాలయాల చుట్టూ.. కాళ్లరిగేలా తిరిగినా.. తన పనికావడం లేదని ఓ రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటన సూర్యాపేట జిల్లా పెన్పహాడ్లో చోటుచేసుకుంది. అన్నారం గ్రామానికి చెందిన రైతు కళ్లెం చెర్ల నాగయ్యకు 48వ సర్వేనెంబర్లో ఒక ఎకరం 8 గుంటల భూమి పాత రికార్డులో ఉంది. ఇటీవల నిర్వహించిన భూ ప్రక్షాళనలో కేవలం 21 గుంటల భూమి మాత్రమే సాగులో ఉన్నట్లు గుర్తించారు. పాత రికార్డులో తనకు ఉన్న ఎకరం 8 గుంటల భూమిని కొత్త రికార్డులో చేర్చాలని సదరు రైతు మొరపెట్టుకున్నాడు. ఈ విషయాన్ని పలుమార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. కానీ..ఎమ్మార్వో మాత్రం రైతుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. మనస్తాపం చెందిన రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. సకాలంలో గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి: ప్రియురాలికి చావు పరీక్ష పెట్టిన కిరాతకుడు