సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని పలు మండలాల్లో అగ్నిప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో గడ్డివాములు దగ్ధమయ్యాయి. మద్దిరాల మండలం గోరుట్లలో పులుసు లింగయ్య అనే రైతుకు సంబంధించిన 2 గడ్డివాములు, నూతనకల్ మండలం దర్షనపల్లిలో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని గడ్డివాముతో పాటు మామిడి తోట, టేకు మొక్కలు దగ్ధమయ్యాయి. పక్కనే ఉన్న పశువుల పాక, పక్కనున్న నర్సరీలోని మొక్కలు సైతం కాలిపోయాయి.
తుంగతుర్తి మండలం బండరామారంలో కల్లూరి అవిలయ్యకు చెందిన 3 ఎకరాల గడ్డివాము కాలిబూడిదయ్యింది. అడ్డగుడూరులో అబ్దుల్ మతిన్ అనే వ్యక్తికి సంబంధించిన వ్యవసాయ బావివద్ద రెండు గడ్డివాములు దగ్ధమయ్యాయి.