సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఫీల్డ్ అసిస్టెంట్ల ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం విధించిన 40 శాతం పనిదినాల సర్క్యూలర్ మూలంగా ఫీల్డ్ అసిస్టెంట్లు తమ ఉనికిని కోల్పోతున్నారు. ఉద్యోగులకు ఇబ్బందిగా మారిన 47,79 జీవోలను రద్దు చేయాలని ఐకాస డిమాండ్ చేసింది.
పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తమ సమస్యలపై చర్చించాలని కోరారు. ఎలాంటి షరతులు లేకుండా ఫీల్డ్ అసిస్టెంట్ల కాంట్రాక్టును రెన్యూవల్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించని నేపథ్యంలో మార్చి 11న హైదరాబాదులో మహా ధర్నా చేస్తామని తెలిపారు.
ఇవీ చూడండి: అడవిని చదివిన 'తులసి'బామ్మకు పద్మశ్రీ