ప్రమాదవశాత్తు చెరువులో పడి రైతు మృతి చెందిన విషాదకర ఘటన సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పోలుమళ్లలో చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన ఎర్రబెల్లి వెంకటేశ్వర్లు (40) తన బురద పొలంలో గొర్రు కట్టి ఎడ్లను కడగటానికి సమీపంలోని ముత్యాలమ్మ చెరువులోకి వెళ్లగా... ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడిపోయాడు. గమనించిన ఇద్దరు వ్యక్తులు టవల్ అందించే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం దక్కలేదు.
టవల్ అందకపోవడం వల్ల చెరువులో మునిగి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఘటనా స్థలికి చేరుకొని చెరువులోకి దిగి గాలించగా.. గంట తర్వాత మృతదేహం లభ్యమైంది. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇంటికి పెద్దదిక్కును కోల్పోయిన ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ చిలువేరు భవాని లింగరాజు, ఎంపీటీసీ ఉమా మల్లారెడ్డి కోరారు.
ఇవీ చూడండి: విషాదం: కరెంట్‌షాక్ కొట్టి ఓ వ్యక్తి మృతి