రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ భాస్కరన్ పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని సనా ఇంజినీరింగ్ కళాశాలలో సైబర్ నేరాలపై శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు.
ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ పెరగడం వల్ల మనకు తెలియకుండానే ఎన్నో సైబర్ నేరాలు వెలుగులోకి వస్తున్నాయని ఎస్పీ పేర్కొన్నారు. సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండి, చుట్టుపక్కల వారినీ అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు.
ఇవీ చూడండి: రెండు కిలో మీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్