సూర్యాపేట జిల్లాలో మునగాల, చిలుకూరు మండలాలలో రేపు జరగబోయే ప్రాదేశిక ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మునగాల మండలంను 5 ఎన్నికల రూట్స్గా, మూడు జోన్లుగా విభజించారు. మొత్తం 390 మంది ఎన్నికల సిబ్బంది, 30 మంది రిజర్వ్ సిబ్బంది ఎన్నికల్లో విధులు నిర్వహించబోతున్నారు. మండలంలో మొత్తం నాలుగు సమస్యాత్మక గ్రామాలు గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎలాంటి గొడవలు కాకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరుపుతామని తెలిపారు. అలాగే చిలుకూరు మండలను 8 ఎన్నికల రూట్స్, రెండు జోన్లుగా విభజించారు. మొత్తం 100 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నారు.
ఇవీ చూడండి: మొన్న హాల్ టికెట్ మిస్... నిన్న పాస్