సూర్యాపేట జిల్లాలో ప్రభుత్వం పూర్తి చేసిన రెండు పడక గదుల ఇళ్లపై కొన్ని రాజకీయ పార్టీలు ప్రజలను రెచ్చగొడుతున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు. అన్ని పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాలనుకున్న సమయంలో అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని హితవు పలికారు. చివ్వెంల మండలం తిరుమలగిరి గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు. సూర్యాపేట కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఎంపిక ప్రక్రియను అక్కడికి వచ్చిన ఓ చిన్నారితో లబ్ధిదారుల పేర్లను లాటరీ ద్వారా తీయించారు.
ఇవీచూడండి: కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యలపై ఉత్తమ్ స్పందన