సూర్యాపేట జిల్లాలో తెరాస 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హుజూర్ నగర్లో ఎమ్మెల్యే సైదిరెడ్డి ఆశా వర్కర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసినారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, డాక్టర్లు, తెరాస శ్రేణులు పాల్గొన్నారు. నిరుపేదలు ఎవరు పస్తులతో ఉండొద్దనే సీఎం కేసీఆర్ ఆశయాన్ని అమలు చేస్తున్నామని సైదిరెడ్డి అన్నారు. కరోనాపై చేస్తోన్న పోరులో మున్సిపల్ సిబ్బంది, డాక్టర్లు, పోలీసులు, జర్నలిస్టుల కృషి అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. కరోనా లాక్ డౌన్ కొనసాగుతోన్న నేపథ్యంలో ప్రజలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా రేషన్ బియ్యం, రూ.1500 రూపాయల నగదును, తెల్ల కార్డుదారులందరికీ అందిస్తున్నామని వివరించారు. వలస కూలీలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. దాతలు ముందుకువచ్చి నిరుపేదలను ఆదుకోవాలని కోరారు.
ఇవీ చూడండి : దేశంలో లాక్డౌన్ 3.0 ఖాయమే.. అతి త్వరలోనే ప్రకటన