ETV Bharat / state

COVID: నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కొవిడ్ ఉద్ధృతి.. కారణాలు అవేనా? - నల్గొండ జిల్లా వార్తలు

రాష్ట్రమంతటా కరోనా కేసులు తగ్గుతుంటే.. 7 జిల్లాల్లో మాత్రం ఉద్ధృతి తగ్గడం లేదని వైద్యారోగ్యశాఖ గుర్తించింది. అందులో నల్గొండ, సూర్యాపేట జిల్లాలున్నట్లు ప్రకటించింది. సరిహద్దు ప్రాంతాలు ఎక్కువగా ఉండటం... పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికుల సంచారం వల్ల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అటు పటిష్ఠ చర్యలతో కేసులు అదుపులోకి తెస్తున్నామని జిల్లా అధికారులు చెబుతున్నారు.

corona cases in nalgonda, covid cases in suryapet
నల్గొండలో కరోనా కేసులు, సూర్యాపేటలో కొవిడ్ కేసులు
author img

By

Published : Jul 20, 2021, 8:29 AM IST

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొవిడ్ ఉద్ధృతి

రాష్ట్రవ్యాప్తంగా 7 జిల్లాల్లో కొవిడ్‌ కేసుల ఉద్ధృతిని వైద్యారోగ్యశాఖ గుర్తించింది. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మినహాయిస్తే ఏరియా ఆస్పత్రులతోపాటు జిల్లా దవాఖానాల్లో కొవిడ్ కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో కేసుల ఉద్ధృతి తగ్గడం లేదని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ పేర్కొంది. ముఖ్యంగా కొన్ని మండలాలు, గ్రామాల పరిధిలో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని.. నియంత్రణ చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం కనపడుతోందని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు సరిహద్దులుగా ఉండటంతో... రాకపోకల ప్రభావం ఇక్కడి ఆస్పత్రుల్లో కనపడుతున్నట్లు తేల్చిచెప్పింది.

సాగర్ ప్రచారం

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని హాలియా, త్రిపురారం, పెద్దవూర మండలాలకు రాకపోకలు అధికంగా ఉంటున్నాయి. గత ఏప్రిల్‌లో జరిగిన సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా చేపట్టిన పార్టీల ప్రచారంతో కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఆ ఎన్నికల ప్రభావంతో కరోనా సోకిన వారి సంఖ్య 10 వేలు దాటింది. దీనిపైనే వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ గతంలో హాలియాలో సమీక్ష నిర్వహించారు.

కార్మికుల వల్లేనా?

ఆంధ్రప్రదేశ్ సరిహద్దులు కలిగి ఉండడం, హైదరాబాద్ నుంచి రాకపోకలు కొనసాగుతున్నందున కేసులు పెరుగుతున్నాయి. మహబూబ్‌నగర్ నుంచి రాకపోకలు జరుగుతుండడం ఒక కారణం అయి ఉండొచ్చు. మిర్యాలగూడ పరిసర ప్రాంతాల్లో బియ్యపు మిల్లులు వందకు పైగా ఉండటం... దామరచర్ల మండలంలో నిర్మితమవుతున్న విద్యుత్తు కేంద్రంలో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల కార్మికులు పనిచేస్తుండటం, వారి రాకపోకల ప్రభావంతో కేసుల తీవ్రత ఎక్కువవుతోంది. అంతేకాకుండా కొన్ని సాంకేతిక సమస్యల వల్ల గణాంకాల్లో తేడా ఉంటోంది. జులై చివరి నాటికి కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.

-కొండల్‌రావు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి

నకిరేకల్‌లోనూ ఉద్ధృతి

నకిరేకల్ నియోజకవర్గంలోనూ కేసులు తగ్గడం లేదని గుర్తించిన వైద్యారోగ్యశాఖ... వ్యాపార నిమిత్తం రాకపోకలు అధికంగా ఉంటున్న సూర్యాపేట జిల్లాలోనూ కొవిడ్ ఉద్ధృతి తగ్గడం లేదని పేర్కొంది. ఈ నెల 1 నుంచి 17 వరకు నల్గొండ జిల్లాలోని... 44 ఆరోగ్య కేంద్రాల్లో 78,351 పరీక్షలు నిర్వహిస్తే... 2,318 మందికి పాజిటివ్ వచ్చింది. కేసుల తీవ్రత 2.96 శాతంగా నమోదైందని వెల్లడించింది.

పటిష్ఠ చర్యలు

పై అధికారుల నుంచి వస్తున్న ఆదేశాలతో క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తమవుతున్నారు. 4 పద్ధతులు అమలు చేస్తూ.. కొవిడ్ కట్టడిపై దృష్టి సారించారు. జ్వర సర్వే, నిర్ధరణ పరీక్షలు, వ్యాక్సినేషన్, కంటెయిన్మెంట్ విధానాల ద్వారా.. కేసుల తీవ్రతను తగ్గించే పనిలో పడ్డారు.

ఇదీ చదవండి: Norovirus: ఏమిటీ నోరోవైరస్‌..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.