సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పనుల్లో అవినీతి జరిగిందంటూ స్వయంగా అధికార పార్టీ కౌన్సిలర్లతో పాటు కాంగ్రెస్ కౌన్సిలర్లు పుర కమీషనర్‌కు ఫిర్యాదు చేశారు. పట్టణ ప్రగతి పనుల్లో మురుగు కాల్వల రోడ్డు పక్కన తొలిగించిన మట్టిని 100 రూపాయలకే ట్రాక్టర్ లోడ్ విక్రయించారని ఆరోపించారు. ఓవైపు ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాకూడదన్న ప్రభుత్వ నిబంధనలుండగా ఇదే అదనుగా టెండర్లు పిలవకుండానే పనులు చేసి బిల్లులు తీసుకుంటున్నారని అన్నారు.
సుమారు 21 లక్షల రూపాయల మేర అవినీతి చోటు చేసుకుందన్నారు. కమీషనర్ సమాధానం చెప్పే వరకు ఇక్కడ్నుంచి కదిలేది లేదని కార్యాలయం ముందు, కింద కూర్చొని కౌన్సిలర్లు నిరసన తెలిపారు.