సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నాయని ఉత్తమ్ ఆరోపించారు. కేంద్ర తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేసిందని, 13 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగితే పరిహారం చెల్లించలేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి చెందలేదని, అంతా అవినీతి మయమైందన్నారు. హుజూర్నగర్లో కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధే కనిపిస్తోందని వెల్లడించారు. నియోజకవర్గంలో ఇసుక, మట్టి, గుట్కా, రేషన్, భూ కబ్జా లాంటి అక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి: నో ఎల్ఆర్ఎస్-నో టీఆర్ఎస్ నినాదంతో ముందుకు పోతాం: ఉత్తమ్