సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్పహడ్లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, సీనియర్ నేతలు జానారెడ్డి, శ్రీధర్‌బాబు ప్రచారం చేశారు. హస్తం గుర్తుకు ఓటేసి ఉత్తమ్ పద్మావతి రెడ్డిని గెలిపించాలని కోరారు. హుజూర్నగర్ ఉపఎన్నిక ప్రజాస్వామ్యానికి, నియంతృత్వ పాలనకు మధ్య పోటీ అని భట్టి అన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చి.. కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని జానారెడ్డి ఆరోపించారు. సైదిరెడ్డికి ఓటేస్తే హుజూర్నగర్ అభివృద్ధి కుంటుపడుతుందన్నారు.
ఇవీచూడండి: 'ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మంత్రులపై కేసు నమోదు చేయాలి'