గాల్వన్ లోయలో సూర్యాపేట జిల్లా వాసి కల్నల్ సంతోశ్బాబు వీరమరణం పొంది.. ఈ నెల 15కు ఏడాది కావస్తోంది. ఈ సందర్భంగా కల్నల్ తల్లిదండ్రులు ఈటీవీ-ఈటీవీ భారత్తో తమ మనోవేదన పంచుకున్నారు.
కుమారుడిని కోల్పోయినందుకు తల్లిదండ్రులుగా బాధగానే ఉన్నా.. సంతోశ్బాబు అందరి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నందుకు గర్వంగా ఉందని భావోద్వేగానికి లోనయ్యారు. తన త్యాగంతో ఎంతోమందిలో స్ఫూర్తి నింపాడని అన్నారు.
మరోవైపు సూర్యాపేటలోని కోర్టు చౌరస్తాకు కల్నల్ సంతోశ్బాబు కూడలిగా నామకరణం చేయనున్నారు. సంతోశ్బాబు వర్ధంతిని పురస్కరించుకుని ఆయన కాంస్య విగ్రహాన్ని మంగళవారం మంత్రి కేటీఆర్ ఆవిష్కరించనున్నారు.