సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మండలంలోని మేళ్ల చెరువు, వెల్లటూరు, హేమ్లా తండ గ్రామపంచాయతీల్లో కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి పర్యటించారు. గ్రామపంచాయతీల్లో డంపింగ్ యార్డ్, శ్మశాన వాటికల పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
హరితహారంలో భాగంగా మేళ్ల చెరువులో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ ఆర్డీవో, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ఆస్తికోసం కొడుకుల కుట్ర.. ఆలయంలో తలదాచుకున్న తల్లి..