సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇప్పటికే మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న ప్రాంతాలపై దృష్టి సారించారు. అక్కడికి వెళ్లి వైద్య సిబ్బందికి, అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీసులు మరింత భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు.
కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ప్రజలు బయటకు రావొద్దని... ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మరో ఆరు కేసులు నమోదయ్యాయని తెలిపారు.
ఇవీచూడండి: లాక్డౌన్లో 1400 కి.మీ వెళ్లింది... కొడుకును తెచ్చుకుంది...