ఇవీ చూడండి:ఎమ్మెల్సీ ఫలితాలే రిపీట్: పొన్నం ప్రభాకర్
ఇది ఆసుపత్రా.. లేక పశువుల సంతా..? - suryapet
పోలింగ్ కేంద్రాలను పరిశీలించేందుకు వచ్చిన కలెక్టర్ ఆకస్మికంగా పశువుల దవాఖానాను సందర్శించారు. ఆ సమయంలో ఆసుపత్రిలో మందులు చిందర వందరగా పడి ఉండటం చూసి వైద్యుడికి చురుకలంటించారు.
వైద్యుడిని మందలిస్తున్న కలెక్టర్
సూర్యాపేట జిల్లా బాలెంల గ్రామంలో ఉన్న పశువుల ఆసుపత్రిలో కలెక్టర్ అమోయ్ కుమార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించేందుకు వచ్చిన జిల్లా పాలనాధికారి పక్కనే ఉన్న పశువుల ఆసుపత్రిని తనిఖీ చేశారు. సరిగ్గా ఆ సమయంలో ఆసుపత్రి అచ్చం పశువుల పాకను తలపించింది. దవాఖానా గదుల్లో ఔషధ బాటిళ్లు చిందర వందరగా పడి ఉన్నాయి. ఇది చూసిన కలెక్టర్ ఆగ్రహంతో వైద్యుడిని మందలించారు. కార్యాలయాలను తమ సొంత ఇంటిలా ఉంచుకోవాలని సూచించారు. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇవీ చూడండి:ఎమ్మెల్సీ ఫలితాలే రిపీట్: పొన్నం ప్రభాకర్