ETV Bharat / state

CM KCR Suryapet Tour Today : నేడు సూర్యాపేటలో సీఎం కేసీఆర్ పర్యటన​.. 'ప్రగతి నివేదన సభ' ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి - సూర్యాపేట టూర్​

CM KCR Visit To Suryapet Today : సీఎం కేసీఆర్​ నేడు సూర్యాపేట జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. కలెక్టరేట్​, ఎస్పీ ఆఫీస్​, వ్యవసాయ మార్కెట్​, బీఆర్​ఎస్​ పార్టీ కార్యాలయం వంటి భవనాలను ప్రారంభించనున్నారు. అనంతరం ప్రగతి నివేదన సభలో పాల్గొననున్నారు. అందుకు తగిన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం సిద్ధం చేసింది.

CM KCR
CM KCR Suryapet Tour
author img

By

Published : Aug 20, 2023, 7:25 AM IST

CM KCR Visit To Suryapet Today : ముఖ్యమంత్రి కేసీఆర్​.. నేడు సూర్యాపేటలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అనంతరం ప్రగతి నివేదన సభ(Pragathi Nivedhana Sabha)కు హాజరుకానున్నారు. ఇందుకోసం వ్యవసాయ మార్కెట్​ యార్డు సమీపంలోని మైదానాన్ని అధికారులు సిద్ధం చేశారు. సీఎం పర్యటన(CM KCR Tour) సందర్భంగా జిల్లా కేంద్రంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కేసీఆర్​ సభను విజయవంతం చేసేందుకు.. జిల్లా మంత్రి జగదీశ్​ రెడ్డి సహా ఉమ్మడి నల్లొండ జిల్లా బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు కృషి చేస్తున్నారు.

ఇవాళ ఉదయం 11 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్​ ద్వారా సూర్యాపేట చేరుకోనున్న సీఎం కేసీఆర్(CM KCR)​.. తొలుత వైద్య కళాశాలను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత సామూహిక కూరగాయల మార్కెట్​ యార్డ్​, ఎస్పీ కార్యాలయం, కలెక్టరేట్​ నూతన భవన సముదాయాన్ని ప్రారంభించనున్నారు. చివరన బీఆర్​ఎస్​ కార్యాలయం ప్రారంభించి.. ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

CM KCR speech on Telangana development : "ప్రగతి పథంలో తెలంగాణ.. మూడు రెట్ల ఆర్థికవ్యవస్థ పెంపే లక్ష్యం"

CM KCR Pragathi Nivadhana Sabha In Suryapet : ఇక్కడ ప్రారంభించాల్సిన భవనాలను ఎంతో సుందరంగా ముస్తాబు చేశారు. అనంతరం వ్యవసాయ మార్కెట్​ యార్డు సమీపంలోని మైదానంలో ప్రగతి నివేదన సభకు హాజరై.. ప్రసంగించనున్నారు. ఈ సభను ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. పదేళ్ల పాటు జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ సభ ఉపయోగపడుతుందని అభిప్రాయపడుతున్నారు.

సీఎం కేసీఆర్​ పర్యటన వివరాలు..: భవనాలను ప్రారంభించిన అనంతరం సీఎం కేసీఆర్​.. అక్కడ అధికారులతో ముచ్చటించి, అక్కడే భోజనం చేస్తారని అధికార యంత్రాంగం తెలిపింది. మరోవైపు సీఎం పర్యటన సందర్భంగా సూర్యాపేట పట్టణం అంతా ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో నిండి గులాబీ సొగను విరజిమ్ముతోంది. చౌరస్తాలు, కూడళ్లు గులాబీ రంగుతో ముస్తాబయ్యాయి. ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్​ పాల్గొనే తొలి సభ ఇదే కావడంతో.. మంత్రి జగదీశ్​ రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. సుమారు రెండు లక్షల మందితో సభ నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

KCR to Contest from Kamareddy in Elections 2023 : కామారెడ్డి నుంచి ఎమ్మెల్యేగా బరిలో సీఎం కేసీఆర్‌!

CM KCR Suryapet Tour : ఒకేరోజు నాలుగైదు ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉండడంతో పట్టణంలో సీఎం కేసీఆర్​ సుమారు 30 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తారని అధికార యంత్రాంగం తెలిపింది. అందుకు తగినట్లు 3 వేల మందితో భారీ బందోబస్తును పోలీస్​ అధికారులు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్​ సమస్యలు రాకుండా చూసుకుంటున్నారు. ఉదయం 11.15 గంటలకు హైదరాబాద్​ నుంచి బయలుదేరే సీఎం.. మళ్లీ సాయంత్రం 4.45 గంటలకు హైదరాబాద్​ తిరిగి ప్రయాణమవ్వనున్నారు.

CM KCR Districts tour : ఈ నెల 19, 20 తేదీల్లో మెదక్​, సూర్యాపేట జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన

BRS MLA Tickets Telangana 2023 : సీట్ల కోసం BRS నేతల ఫైట్లు.. కేసీఆర్ సాబ్ ఎవరికి 'ఊ అంటారు.. ఎవర్ని ఊఊ' అంటారో..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.