ETV Bharat / state

'హస్తం'ఇచ్చిన వరణుడు.. రద్దయిన సీఎం సభ - Huzurnagar Meeting Cancelled CM KCR

హుజూర్​నగర్​లో ముఖ్యమంత్రి సభ అర్ధాంతరంగా రద్దు కావటం వల్ల తెరాస శ్రేణులు అయోమయానికి గురయ్యాయి. ఉప ఎన్నికలో పార్టీ ఓటింగ్​కు జీవం పోసేలా సాగాల్సిన సభ.. సీఎం హాజరు కాకుండానే ముగిసిపోయింది.

'హస్తం'ఇచ్చిన వరణుడు.. రద్దయిన సీఎం సభ
author img

By

Published : Oct 18, 2019, 6:29 AM IST

మూడు దఫాలుగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పుకుంటున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి దీటుగా... అంతకుమించి అభివృద్ధిపై ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటన చేస్తారని ఆశించిన తెరాస శ్రేణులకు నిరాశే ఎదురైంది. ఉప ఎన్నికల్లో పార్టీకి బలాన్నిచ్చేందుకు ఏర్పాటు చేసిన బహిరంగ సభ.. అనుకోకుండా రద్దయింది. కుండపోత వర్షంతో సభ నిర్వహణకు వీలు కాకుండా పోయింది. అటు హెలికాప్టర్ ప్రయాణానికీ అనుమతి లభించకపోవటం వల్ల ఏకంగా కార్యక్రమాన్నే రద్దు చేయాల్సి వచ్చింది.

కొంప ముంచిన జోరు వాన

ఈ నెల 21న జరగనున్న హుజూర్​నగర్ ఉప ఎన్నికలో... ఇప్పటికే ప్రధాన పార్టీలు జోరుగా ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ వస్తే పార్టీకి జవసత్వాలు లభిస్తాయని తెరాస శ్రేణులు భావిస్తే... అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. సభా వేదిక వద్ద ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన వర్షం జోరుందుకోవటం వల్ల గులాబీ శ్రేణులు అయోమయానికి గురయ్యాయి. అయితే ముఖ్యమంత్రి ప్రయాణించే హెలికాప్టర్​కు పౌర విమానయాన విభాగం అనుమతి నిరాకరించటం వల్ల సభను రద్దు చేస్తున్నట్లు ఉప ఎన్నిక బాధ్యుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రకటించారు. సభ కోసం భారీ సంఖ్యలో అప్పటికే సభా ప్రాంగణానికి చేరుకున్న వందలాది ప్రజలు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.

'హస్తం'ఇచ్చిన వరణుడు.. రద్దయిన సీఎం సభ

ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.