సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని పెద్ద చెరువును మై హోం అధినేత రామేశ్వర్ రావు, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌తో కలసి త్రిదండి శ్రీ చినజీయర్ స్వామివారు సందర్శించారు. మాతృభూమి ఐక్య వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన చెరువు సుందరీకరణ పనులను చిన జీయర్ స్వామి పరిశీలించారు. కోదాడ పెద్ద చెరువు అభివృద్ధికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
కోదాడ పట్టణాభివృద్ధిలో భాగంగా మాతృభూమి ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై ప్రసంగించారు. ప్రజలు కలిసికట్టుగా పనిచేసి సుందర నగరంలా తీర్చిదిద్దాలని సూచించారు.
ప్రపంచానికి టీకాను అందించిన దేశంగా భారత్ నిలించిందన్నారు. హైదరాబాద్ నుంచి టీకాను ప్రపంచ దేశాలకు అందించడం మన గర్వకారణమని చినజీయర్ స్వామి పేర్కొన్నారు. చెరువు అభివృద్ధికి తనవంతు కృషిచేస్తానని జూపల్లి రామేశ్వర్ రావు అన్నారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో 24 గంటల్లో వెయ్యి దాటిన కరోనా కేసులు