ETV Bharat / state

గుర్రంబోడు తండా ఘటనలో 21 మందిపై కేసులు.. ఆరుగురి అరెస్ట్ - suryapet district latest news

గుర్రంబోడు భూములపై ఆందోళనకు దిగి ఘర్షణలు చెలరేగేలా చేశారంటూ.. భాజపా నేతలపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. ఆదివారం జరిగిన ఘర్షణలకు కారణమయ్యారంటూ... ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితోపాటు పలువురు నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆరుగురిని అరెస్టు చేశారు.

cases on bjp leaders in gurrambodu incident
గుర్రంబోడు తండా ఘటనలో 21 మందిపై కేసులు.. ఆరుగురి అరెస్ట్
author img

By

Published : Feb 9, 2021, 4:45 AM IST

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడు తండా శివారులోని వివాదాస్పద భూములు.. క్రమంగా రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. ఆదివారం భాజపా నిర్వహించిన గిరిజన భరోసా యాత్ర.. ఘర్షణకు దారితీసింది. పార్టీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత నెలకొనడంతో.. ఘటనకు పార్టీ సీనియర్‌ నేతలు కారకులంటూ.. పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తోపాటు ఎమ్మెల్యే రఘునందన్‌రావుపై మఠంపల్లి పోలీసు స్టేషన్‌లో సెక్షన్‌ 143, 144, 147, 148, 332, 333 కింద కేసులు నమోదయ్యాయి.

భాజపా సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు భాగ్యరెడ్డిని ఏ1 నిందితుడిగా పేర్కొంటూ అరెస్టు చేశారు. ఘటనకు కారకులుగా భావిస్తున్న మరో అయిదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా 21 మందిపై కేసులు నమోదు చేశారు. నిర్వాసితుల భూములను పరిశీలించేందుకు బండి సంజయ్ సభా వేదికకు వస్తున్న క్రమంలో... గుర్రంబోడు శివారులోని ప్రైవేటు కంపెనీ షెడ్డును కూల్చేందుకు కార్యకర్తలు యత్నించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఈ ఘటనలో కోదాడ డీఎస్పీ, హుజూర్‌నగర్ సీఐ, కోదాడ ఎస్సై సహా పలువురికి గాయాలయ్యాయి. దాడికి కారకులైన వారిపై నిఘా వర్గాలు దృష్టి సారించాయి. పోలీసులపై రాళ్లు రువ్వినవారు స్థానికులా లేదా ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారా అని ఆరా తీస్తున్నారు. ఘటనలో ప్రత్యక్షంగా 200మంది పాల్గొన్నట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించిన అధికారులు... అందులో కీలకమైన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. మరోవైపు భాగ్యరెడ్డిని అర్ధరాత్రి అక్రమంగా తీసుకెళ్లారని బండి సంజయ్‌ ఆరోపించారు. మరో 25 మందిపై కేసు నమోదు చేయడాన్ని ఖండించారు. ప్రభుత్వం ఎన్ని రకాలుగా భయపెట్టినా భాజపా భయపడదని.. గిరిజనులకు తమ భూములను అందించేంతవరకు కృషిచేస్తోందని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: గుర్రంబోడు తండా ఘటనలో 21 మందిపై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.