సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడువాయి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్ను ఢీ కొట్టి వోల్వో బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురికి స్వల్ప గాయాలయ్యాయి.
బస్సులో 45 మంది ఉన్నామని.. తామంతా ద్రాక్షారామం నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రయాణికులు తెలిపారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని హైవేపై నెలకొన్న ట్రాఫిక్ అడ్డంకిని తొలగించారు. గాయపడ్డ వారిని కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చూడండి: రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరి అరెస్టు