ETV Bharat / state

ఆ రెండు గ్రామాలను ముంపు ప్రాంతాలుగా గుర్తించాలంటూ ధర్నా - పులిచింతల ప్రాజెక్టు వద్ద విజినేపల్లి గ్రామస్థుల ధర్నా

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టు వంతెన వద్ద వజినేపల్లి, బుగ్గమాధారం గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. పులిచింతల గేట్ల ద్వారా విడుదలైన నీరు.. గ్రామాల్లోకి చేరి వందల ఎకరాలను ముంచెత్తుతోందని.. తమ గ్రామాలనూ ముంపు గ్రామాల కింద పరిగణించాలని డిమాండ్​ చేశారు.

buggamadharam and viginepally  villagers dharna at pulichintala project
ఆ రెండు గ్రామాలను ముంపు ప్రాంతాలుగా గుర్తించాలంటూ ధర్నా
author img

By

Published : Sep 28, 2020, 5:12 PM IST

సూర్యాపేట జిల్లా వజినేపల్లి, బుగ్గమాధారం గ్రామాలను పులిచింతల ప్రాజెక్టు ముంపు ప్రాంతాల కిందకు తీసుకోవాలని డిమాండ్​ చేస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. 2008 నుంచి పులిచింతల నీటి వల్ల వేసిన ప్రతి పంట నీట మునిగి నష్టపోతున్నామని రైతులు వాపోయారు. ముంపునకు గురై వ్యవసాయ భూమిని కోల్పోతున్నామని.. రానున్న రెండు మూడేళ్లలో పూర్తి భూమిని కోల్పోయే అవకాశముందని.. ఈ మేరకు తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్​ చేశారు.

వజినేపల్లి, బుగ్గమాధారం గ్రామాల్లోని నిరుద్యోగులకు పులిచింతల ప్రాజెక్టుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్​ చేశారు. ఇప్పటికైనా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమను పట్టించుకోవాలని కోరారు. మూడేళ్లుగా ఏటా వేసిన పంటకు నష్టమే వాటిల్లుతోందని.. సర్కారు స్పందించి నష్టపరిహారం చెల్లించాలని గ్రామస్థులు డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండిః నిండుకుండలా పులిచింతల... 14గేట్ల ద్వారా నీటి విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.