కేంద్రంలో భాజపా రెండవ సారి అధికారంలోకి వచ్చి మొదటి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా.. సూర్యాపేట జిల్లాలో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. మద్దిరాలలో మండల స్థాయి పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి భాజపా సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిబాబు హాజరయ్యారు. ప్రధాని మోదీ పాలన సుభిక్షంగా ఉందని కొనియాడారు. ఆర్టికల్ 370 రద్దు, సీఏఏ, రామజన్మభూమి, తలాక్ బిల్లు వంటి సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించిన ఘనత మోదీకే దక్కుతుందని స్పష్టం చేశారు.
ఏడాది పాలనపై భారీ ప్రచారం
లాక్డౌన్ సమయంలో పేద ప్రజలకు రూ. 1500లు జమ చేయడం, రైతులకు రూ. 2000లు జమ చేయడం, ఉజ్వల గ్యాస్ 3 నెలలు ఉచితంగా అదించిన విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు సాయిబాబు తెలిపారు. ఈ కార్యక్రమం 17వ తేదీ వరకు గ్రామం స్థాయిలో ప్రతి ఇంటికి ప్రచారం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మద్దిరాల భాజపా మండల అధ్యక్షులు భూతం సాగర్, మండల ప్రధాన కార్యదర్శి ఎలిమినేటి యాకయ్య, గోరంట్ల గ్రామ శాఖ అధ్యక్షులు ఎలిమినేటి శ్రీనివాస్, మద్దిరాల గ్రామ శాఖ అధ్యక్షులు ఉపేందర్‌లు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: జూడాల సమ్మె కొనసాగింపు.. సూపరింటెండెంట్‌కు లేఖ