ETV Bharat / state

భీంరెడ్డి పోరాటం.. తరతరాలకు స్ఫూర్తి - EX MP Bhimreddy Narsimha Reddy

కాలంతో పరుగులు పెడుతూ, స్వేచ్ఛను, సంతోషాన్ని డబ్బుల్లో వెతుకుతున్నాం. మనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని నిర్మించుకోలేక.. ఉన్నోనిదే రాజ్యమని నిలదీయలేక.. రాజీతో పోరును ఆపి బతుకుతుంటాం. కానీ నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించి... కొట్లాడి, నిలబడ్డ పోరు కెరటం భీంరెడ్డి నర్సింహా రెడ్డి. వెట్టి చాకిరి, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు. భూమి, భుక్తి, విముక్తి కోసం గడీని విడిచి తుపాకీ చేతపట్టి, బడుగు జీవులకు బలమై వారి కళ్లలో వెలుగు నింపిన మహానియుల చరిత్ర ఎప్పుడు మనుషులను మేల్కోపుతుంది. అలాంటి వీరుడు బీఎన్​ రెడ్డి వర్థంతి సందర్భంగా ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

Bhimreddy Narsimha Reddy
Bhimreddy Narsimha Reddy
author img

By

Published : May 9, 2020, 8:14 PM IST

భీంరెడ్డి నర్సింహా రెడ్డి(బీఎన్​ రెడ్డి) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కర్విరాల కొత్తగూడెం గ్రామంలో భీంరెడ్డి రాంరెడ్డి, చొక్కమ్మ దంపతులకు 1922 మార్చి 15 నాడు జన్మించారు. బీఎన్​ రెడ్డి పెద్దింటి భూస్వామి కుటుంబంలో జన్మించినా... పేదోళ్ల ఆకలికి అంబలిలా... వారి ఇళ్లలో తొలకరి చినుకుల సవ్వడి తెచ్చిన రైతు బిడ్డ. అన్నదాతలకు పోరాటం నేర్పి... భూస్వాముల అరాచకాలకు అడ్డుగా బడుగు జనులకు అండగా నిలబడ్డారు. అయ్యా - నీ కాళ్లు మొక్కుతా! నీ బాంచన్ దొర, అన్న కష్ట జీవులకు విముక్తి కలిగించిన యోధుడు. దొరల గడీలను గడగడలాడించి గొప్ప మానవ హక్కుల పోరాటాన్ని నిర్మించాడు. అదే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం.

ఈ పోరాటంలో స్వయంగా ఆయుధం పట్టి క్షేత్ర స్థాయిలో పోరాటం చేశారు. అంతే కాకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ, దళాలను ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇచ్చారు. తుంగతుర్తి, ఆలేరు, నోముల, బాలెంల, కందగట్ల, తిమ్మాపేట, పాత సూర్యాపేట, రావులపెంట, మామిళ్లగూడెం, బిక్కుమళ్ల, నెల్లికుదురు ఇలా అనేక రజాకారుల క్యాంపులపై దాడులు చేసి వందలాది ఆయుధాలను సేకరించి సమర్థవంతంగా నాయకత్వం వహించారు. 'బండెనుక బండికట్టి' అనే పాటను రాసి, పాడి, ప్రజలను ఉత్తేజపరిచిన బండి యాదగిరి కూడా బీఎన్ దళ సభ్యుడే.

మొండ్రాయి... తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బొడ్రాయి వంటిది. చాకలి ఐలమ్మ కౌలు చేస్తున్న పంట పొలంపై విసునూరి రాంచంద్రా రెడ్డి కన్ను పడింది. దొర ఆగడాలకు ఎదురొడ్డి బి.ఎన్. రెడ్డి నాయకత్వంలోని యువకులతో ఐలమ్మ పొలంలోని పంటను కోసి, భుజాన వేసుకొని ఇంటికి చేర్చిన ధీరుడు నర్సింహా రెడ్డి. దీనితో కక్షగట్టిన విసునూరు దేశ్​ముఖ్ గుండాలు, పోలీసులు భీంరెడ్డితోపాటు ఆయన అనుచరులను అరెస్టు​ చేసి చిత్ర హింసలు పెట్టారు. ఈ దౌర్జన్యకాండ 'మీజాన్' పత్రిక ద్వారా తెలంగాణ అంతా ప్రచారం అయింది.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట విరమణానంతరం బీఎన్​ రెడ్డి 1954వరకు అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆ తరువాత అరెస్టై జైలు జీవితం అనుభవించారు.

ఏ యుద్ధంలోనైనా అన్నదమ్ముల్లో 'భీముడు' ఒక్కరు ఉంటారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భీంరెడ్డి నర్సింహా రెడ్డికి భీముడి లాంటి తమ్ముడు కుశలవ రెడ్డి ఉన్నారు. అన్న ఉద్యమ స్ఫూర్తితో కుశలవ రెడ్డి గ్రామాల్లో సంఘాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్య పరుస్తూ.. పోరాటంలో అన్నకు అండగా ఉన్నారు. ఇలాంటి ఇద్దరు గొప్ప ప్రజానాయకులు ఒకే తల్లి కడుపులో జన్మించడం సాధారణం. కానీ వీరి మరణంలో కూడా సోదర బంధం వీడలేదు. వీరు మరణించిన సంవత్సరాలు వేరైనా తేదీ మాత్రం ఒక్కటే మే9. వీరిది మరణంలో కూడా ప్రేమను కలిగిన సోదర బంధం.

మూడు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా... రెండు సార్లు శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించిన బీఎన్​ రెడ్డి అనేక ప్రజా సమస్యలపై గళమెత్తి పరిష్కారం చూపించారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలలోని బీడు భూములలో గోదావరి నీళ్లను అందించడం కోసం శ్రీరాం సాగర్ రెండవ దశ కాలువల నిర్మాణానికై పోరాటం చేసి నిధులు మంజూరు చేయించారు. నిత్యం ప్రజల కోసమై పరితపించిన భీంరెడ్డి పోరాటం స్ఫూర్తి విస్మరించలేనిది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.