సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం పాలవరం గ్రామానికి చెందిన ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆ మహిళ భర్త పరారీలో ఉన్నాడు. కుటుంబ కలహాల వల్లే ఆమె చనిపోయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతురాలు వీర కుమారికి, రామారావుకు 11 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. రాత్రి భర్తతో గొడవ పడినట్లు ఇంటి పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఉదయం లేచి చూసేసరికి ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఉన్నట్లు వారి కుమారులు చెబుతున్నారు.
ఇవీ చూడండి: సింధూశర్మకు అండగా మహిళా సంఘాలు