సూర్యాపేట జిల్లా అనంతగిరి ఎస్సై రామాంజనేయులుపై సస్పెన్షన్ వేటు పడింది. 2018లో నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణలో వాస్తవాలు నిర్ధరణ కావడంతో సస్పెండ్ చేశారని ఎస్పీ ఆర్.భాస్కరన్ బుధవారం తెలిపారు.
మండలంలో ఎస్సైపై ఎన్నో ఫిర్యాదులు వచ్చాయని... అవినీతి ఆరోపణలు, అధికారుల ఆదేశాలను ఖాతరు చేయకపోవడం వంటి అంశాలు పరిగణలోకి తీసుకుని సస్పెండ్ చేసినట్లు ఓ ప్రకటనలో ఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి: ఓ ఇల్లాలి క్రైమ్ కథ.. భర్తను ఎందుకు చంపిందో తెలుసా..!