ETV Bharat / state

శుభకార్యం నుంచి వస్తూ అనంతలోకాలకు - pramadam

అప్పటి వరకు ఆనందంగా గడిపారు. దర్గాలో మొక్కు తీర్చుకున్నారు. బంధువుల ఇంటికి ఉత్సాహంగా బయలుదేరారు. మార్గమధ్యంలో అతివేగం వారి ఆనందాలను చిదిమేసింది. ఫలితంగా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందగా... ఇద్దరు గాయపడ్డారు.

ఆనందం విషాదమైంది..
author img

By

Published : Jun 21, 2019, 5:05 PM IST

ఆనందం విషాదమైంది..

సూర్యాపేట జిల్లా చిలుకూరులో మిట్స్ కళాశాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు కామినేని హాస్పిటల్ తరలిస్తుండగా మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని హుజూర్​నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.

దర్గాకు వెళ్లి వస్తుండగా...

ప్రమాదంలో మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. మహబూబాద్ జిల్లా కురవి మండలం చింతపల్లికి చెందిన వారిగా గుర్తించారు. కోదాడలో శుభకార్యానికి వచ్చి అక్కడ కార్యక్రమం అయిపోగానే జాన్​పహాడ్ దర్గా వెళ్లారు. అక్కడి నుంచి హుజుర్​నగర్ వచ్చి.. అక్కడి నుంచి ఆటో కిరాయికి తీసుకొని కోదాడలో ఉన్న బంధువుల ఇంటికి బయలుదేరారు.

డ్రైవర్ అతివేగమే కారణం..

ఉదయం 7 గంటల సమయంలో చిలుకూరు వద్ద ఆటో మరో వాహనాన్ని ఓవర్​ టేక్ చేయబోతున్న సమయంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. ఫలితంగా ఆటోలో ఉన్న ఎనిమిది మంది ఎగిరి రోడ్డు మీద పడటంతో ఎదురుగా వస్తున్న లారీ వారిపై నుంచి వెళ్లింది. నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. మృతులు అఫ్జల్ పాషా(50), మహిముద్ బేగం(33), గౌసియా బేగం(40), మహిన్(15), ముస్కాన్(11), మహబూబ్ పాషాగా గుర్తించారు. గాయపడ్డ జకీర్, నాగుల్ మీరా హుజుర్​నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఘటనా స్థలాన్ని సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్. వెంకటేశ్వర్లు సందర్శించారు. బంధువుల రోదనలతో కోదాడ ఆసుపత్రిలో విషాదం నెలకొంది. ఆటో డ్రైవర్ అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు.

ఇవీ చూడండి: లారీని ఢీకొట్టిన బస్సు- 30 మందికి గాయాలు

Intro:(. )

....రక్తసిక్తం అయిన చిలుకూరు రహదారి......
...చిలుకురులో ఘోరరోడ్డు ప్రమాదం..... ఆరుగురు మృతి.....మరో ఇద్దరికి తీవ్ర గాయాలు....

సూర్యాపేట జిల్లా చిలుకూరులో మిట్స్ కళాశాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరూ కామినేని హాస్పిటల్ తరలిస్తుండగా మృతి చెందారు.. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో హుజూర్నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులను కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు . మృతుల్లో ఇద్దరు పాపలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. వీరందరూ ఒకే కుటుంబ సభ్యులు మహబూబాద్ జిల్లా కురవి మండలం చింతపల్లి కి చెందిన వారిగా తెలుస్తుంది. వీరు కోదాడలో శుభకార్యానికి వచ్చి అక్కడ కార్యక్రమం అయిపోగానే పాలకీడు జాన్పాడుదర్గా వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. హుజూర్ నగర్ నుంచి ఆటో కిరాయికి తీసుకొని కోదాడ బంధువుల దగ్గరికి వస్తుండగా చిలుకూరు ప్రాంతంలో ఆటో మరో వాహనాన్ని ఓవర్టేక్
చేయబోయి ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది దీంతో ఆటో లో ఉన్న ఎనిమిది మంది ఎగిరి రోడ్డు మీద పడటంతో ఎదురుగా వస్తున్న లారీ వారిపై నుంచి వెళ్లి నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలాన్ని సూర్యాపేట జిల్లా ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు సందర్శించడం జరిగింది బంధువుల రోదనలతో కోదాడ హాస్పిటల్ మార్మోగిపోయాయి.

మృతుల వివరాలు::: 1)అఫ్జల్ పాష 50, 2)మహిముద్ బేగం 33, 3) గౌసియా బేగం40, 4)మహిన్15, 5) ముస్కాన్11 6)మహబూబ్ పాషా...

క్షతగాత్రుల వివరాలు:::1)జకీర్ పాషా,2)నాగుల్ మీరా
1బైట్:::ఆర్ వెంకటేశ్వర్లు:::సూర్యపేట ఎస్పీ
ఉదయం ఏడు గంటల ప్రాంతంలో ఘటన జరిగింది . నలుగురు అక్కడికక్కడే మరణించగా మరో ఇద్దరిని హుజూర్ నగర్ కు మరో ఇద్దరిని నార్కెట్పల్లి కామినేని తరలించడం జరిగింది. ఇద్దరిని కామినేని తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించడం జరిగింది. కేవలం ఆటో డ్రైవర్ చేయడం ద్వారానే జరిగిందని ప్రాథమిక నిర్థారణకు వస్తున్నాము.

Body:కెమెరా అండ్ రిపోర్టింగ్:::వాసు
సెంటర్:::కోదాడ

Conclusion:ఫోన్ నెంబర్::9502802407
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.