ఈ రైతు పేరు గాజుల బిక్షం. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం యడవెల్లి వాసి. ఆయనకు భార్య, నలుగురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. 16 ఏళ్ల క్రితం మేకలకు మేత కోసం మండ కొడుతుండగా.. ఓ కంటి పాపకు ముల్లు గుచ్చుకుని చూపుపోయింది. తర్వాత ఏడాదికే మరో కన్నుకూ ఇన్‌ఫెక్షన్ సోకి చూపు పోవడంతో పూర్తిగా అంధుడయ్యారు.
అయినా దిగులు చెందని ఆయన తనకున్న రెండెకరాల్లో భార్య, కుమారుడితో కలిసి వ్యవసాయ పనులు చేస్తూ కుమార్తెల వివాహాలు చేశారు. ఖాళీ సమయాల్లో ఉపాధి హామీ పథకం కూలీ పనులకూ వెళతారు. తన వ్యవసాయ భూమి ఎక్కడున్నదీ తన కాళ్లకు తెలుసని ఎవరి సాయం లేకుండా వెళ్లగలుగుతానని చెబుతారు గాజుల బిక్షం.