సూర్యాపేట జిల్లా హూజూర్‌నగర్ ఉపఎన్నికల్లో 85 ఏళ్ల ఓ వృద్ధురాలు నామినేషన్ వేసింది. స్థానిక తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి అధికారులకు తన నామ పత్రాన్ని అందజేసింది. చింతలపాలెం మండల కేంద్రానికి చెందిన వెంకట రామలక్ష్మి తన భూమి కబ్జా కోరల్లో చిక్కుకుందని.. ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా వారు పట్టించుకోలేదని తెలిపింది. అందుకోసమే ఈ వయసులో నామినేషన్ వేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తన సమస్యను తీర్చాలని కోరింది.
ఇవీ చూడండి: జంటనగరాల్లో భారీవర్షం... ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం