ఒక్కరు కూడా పట్టించుకుంటలే...
కొంతమంది నాయకులు, అధికారులు కుమ్మకై ఎకరం భూమిని కబ్జా చేసి బెదిరిస్తున్నారని తెలిపింది. వృద్ధురాలైన తనని ఏ కార్యాలయానికి వెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. రెండెళ్లుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా.. ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవితం చరమాంఖంలో... ఉన్న ఒక్క ఎకరం కోసం ఇలా కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఎదురైందని కన్నీరు పెట్టుకుంది.
నేనెట్లా బతకాలే...
"నా భూమికి సంబంధించిన పాస్ పుస్తకం నాకు కావాలి. రెండెళ్లుగా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా. 70 ఏళ్లకు పైబడిన వయసులో ఇలా ఆఫీస్‌ల చుట్టూ తిరగలేకపోతున్నా. ముసలిదాన్ని అని కూడా చూడకుండా.. అధికారులు ఇన్ని సార్లు తిప్పించుకుంటున్నారు. నాకు వెనకా ముందు ఎవరూ లేరు. ఉన్న ఒక్క ఎకరానికి పాస్ బుక్కు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఆ స్థలాన్ని కబ్జా చేసి.. ఎవరెవరో అమ్ముకుంటున్నారు. ఇప్పటివరకైతే.. నేను నా భూమిని ఎవ్వరికీ అమ్మలేదు. ఎక్కడా సంతకం కూడా చేయలేదు. పాస్‌పుస్తకం ఇప్పించాలని అధికారుల చుట్టూ తిరిగితే అస్సలు పట్టించుకుంటలేరు. నా దగ్గర భూమికి సంబంధించిన అన్ని పత్రాలున్నాయి. ఈ ఒక్క ఆధారం పోతే ఈ వయసులో నేనెట్ల బతకాలే. నన్ను ఎవరు చూస్తారు. నాకు న్యాయం జరిగేంత వరకు పోరాడతా."- రామాయమ్మ, బాధితురాలు
ఈ వయసులోనూ ఇన్ని సార్లు తిప్పించుకుంటున్నారు...
అధికారులు న్యాయం చేసేంత వరకు నిరసన వ్యక్తం చేస్తానన్న రామాయమ్మ... తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించింది. గతంలో అనంతగిరి తహసీల్దార్‌కు తన బాధను వివరిస్తూ దరఖాస్తు చేసుకుంటే... నా ముందే చించి అవమానించిందని కన్నీటి పర్యంతమైంది. తహసీల్దార్ కార్యాలయంలో అడిగితే రికార్డులు లేవని దాటేస్తున్నారని.. మరి తన సమస్యకు పరిష్కారమేంటని ప్రశ్నిస్తోంది. తన భూమికి తన పేరు మీద పాసు పుస్తకం ఇవ్వటానికి ఈ వయసులోనూ తనను ఇన్ని సార్లు తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరూ అడిగేవారు లేరని.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. న్యాయం జరిగేవరకు.. తన ఒంట్లో శక్తి ఉన్నంత వరకు పోరాడతానని రామాయమ్మ స్పష్టం చేసింది.
ఇవీ చూడండి: