సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉపఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల్లోకి వలసల పర్వం జోరుగా కొనసాగుతోంది. రాయపోల్ మండలం అనాజిపూర్ గ్రామానికి చెందిన 100 మంది యువకులు దుబ్బాకలో రఘునందన్ రావు సమక్షంలో భాజపాలో చేరారు. రఘునందన్ రావు వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
భాజపా గెలుపు కోసం సైనికుల్లా పని చేస్తామని యువకులు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: దుబ్బాక పోరు: తెరాస, కాంగ్రెస్, భాజపా నేతల ఆరోపణల పర్వం