దుబ్బాక పట్టణంలోని పెద్ద చెరువు కట్ట వద్ద విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి సమీర్(18) అనే యువకుడు మృతి చెందాడు. చెరువు కట్ట చుట్టూ నిర్మిస్తున్న గ్రిల్స్‌కు వెల్డింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదం సంభవించింది.
తనతోపాటే పనిచేస్తున్న బిడ్డ ఒక్కసారిగా కుప్పకూలడంతో ఆ తండ్రి గుండె బద్దలైంది. సమీర్ మృతితో చెరువుకట్ట వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. యువకుడి తండ్రి ఫిర్యాదు మేరకు దుబ్బాక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.