ETV Bharat / state

పిడుగుపాటుకు మహిళ మృతి

పిడుపాటుకు మహిళ మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లా కొలుగురులో జరిగింది. వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్లిన రేవతి, గణేశ్​ దంపతులు.. వర్షం రావడం వల్ల చెట్ట కింద నిల్చున్నారు. ఎడ్ల కోసం భర్త వెళ్లాడు. అదే సమయంలో చెట్టుపై పిడుగుపడి రేవతి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

మృతి చెందిన రేవతి
author img

By

Published : Jul 19, 2019, 10:25 PM IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొలుగురుకు చెందిన రేవతి, గణేష్ దంపతులు ఉదయాన్నే వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లారు. పత్తిలో కలుపు తీసే పనిలో నిమగ్నమయ్యారు. సాయంత్రం మెరుపులతో కూడిన భారీ వర్షం రావడం వల్ల వారిద్దరు పక్కనే ఉన్న చెట్టు కిందకి చేరుకున్నారు. అక్కడే ఉన్న ఎడ్లు వర్షానికి తడుస్తున్నాయని వాటిని తీసుకువచ్చేందుకు భర్త గణేశ్​ వెళ్లాడు. ఇంతలోనే భారీ శబ్దంతో కూడిన పిడుగు చెట్టుపై పడడం వల్ల రేవతి అక్కడికక్కడే మృతి చెందింది. శబ్దాన్ని విన్న భర్త చెట్టు కిందకి పరుగులు తీసేలోపే ఆమె విగతజీవై పడి ఉంది.

పిడుగుపాటుకు మహిళ మృతి

ఇవీ చూడండి:'ఇక నోటీసులు లేవు... కూలగొట్టుడే'

Intro:TG_SRD_71_19_PERSSMEET_SCRIPT_TS10058

యాంకర్: ఇటీవల జరిగిన సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలో టాటా ఇoడికాష్ ఏటీఎంలో డబ్బులు దొంగతనం జరిగిన కేసును చేదించిన చేర్యాల పోలీసులు తేదీ 20/21-06-2019 రాత్రి చేర్యాల పట్టణంలో ఏటీఎం లోని గుర్తుతెలియని దొంగలు గ్యాస్ కట్టర్ తో కట్ చేసి అందులో ఉన్న 5.11.400/- రూపాయలను దొంగిలించుకు పోయారని పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ ప్రెస్ మీట్ లో తెలిపారు.

Body:ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ మాట్లాడుతూ.... నేరస్తులను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈరోజు ఉదయం ఎస్బిఐ ఎటిఎం వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఆ వ్యక్తి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వ్యక్తిని విచారించగా దొంగతనం చేసింది మేము అని ఒప్పుకున్నాడు. పధకం ప్రకారం గ్యాస్ సిలిండర్లు ఆక్సిజన్ సిలిండర్ మరియు కట్టర్ల సహాయంతో ఏటీఎంలో డబ్బులు దొంగలించి అని పోలీసుల విచారణలో తెలిపారని కమిషనర్ అన్నారు.

Conclusion:నిందితుడు గుంటూరు జిల్లా పాలెం పత్తిపాడు గ్రామానికి చెందిన వాడిగా ఇతడిపై ఒక హత్య కేసు కూడా ఉందని ఒరిస్సాలో జైలు శిక్ష కూడా అనుభవించాడు అని తెలిపారు. మిగతా నలుగురు హర్యానా కు చెందినవారని అతి త్వరలో వారిని కూడా పట్టుకుంటామని హర్యానా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ ఐదుగురు ఇంతకుముందు ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామంలో గల ఎస్ బి ఐ ఎటిఎం లో 4.40.000 రూపాయలు దొంగలించి మని కేసు ఇన్వెస్టిగేషన్ ఈ దొంగతనం కూడా తేలిందన్నారు. దొరికిన నిందితుడి నుంచి నాలుగు వేల రూపాయలు గ్యాస్ కట్టర్ లు సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.

బైట్: జోయల్ డేవిస్ సిద్దిపేట కమిషనర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.