సిద్దిపేట జిల్లా అక్కన్నపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనతో అక్కడ కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.
కార్యాలయం చుట్టూ..
అక్కన్నపేట మండలం గుడాటిపల్లి గ్రామానికి చెందిన సున్నపు శారద... గౌరవెల్లి ప్రాజెక్ట్ నిర్మాణంలో తన 2.5ఎకరాల భూమి ముంపునకు గురైంది. అయితే తనకు అధికారులు ఒకసారి 35 గుంటలకు, రెండోసారి 13గుంటలకు, మరోసారి ఏడు గుంటలకు పరిహారం చెల్లించారని వివరించింది. ఇంకా .. 30 గుంటలకు పరిహారం ఇవ్వకుండా రెండేళ్ల నుంచి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.
పురుగుల మందు,పెట్రోలుతో..
తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు, పెట్రోలుతో ఆత్మహత్యకు యత్నించింది. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితురాలును అడ్డుకున్నారు. దీనిపై స్పందించిన ఎమ్మార్వో వేణుగోపాలరావు పరిహారం రావాల్సింది వాస్తవమేనని.. 20 రోజులలో విచారణ చేయించి పరిహారాన్ని ఇప్పిస్తానని హామీనిచ్చారు.
ఇదీ చదవండి:ఆగని నిరసన- లోక్సభ మూడోసారి వాయిదా