సిద్దిపేట జిల్లా ములుగు మండలం మామిడ్యాలలో 15టీఎంసీల నీటి సామర్థ్యంతో ప్రభుత్వం కొండపోచమ్మ జలాశయాన్ని నిర్మించింది. కోటి ఎకరాల మాగాణికి సాగునీటిని అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రత్యేక ఈ జలాశంయంపై ప్రత్యేక చొరవ చూపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ మీదుగా కొండపోచమ్మ సాగర్‌కు జలాలను తీసుకొస్తున్నారు. గజ్వేల్ మండలం అక్కారంలో నిర్మించిన పంపు హౌస్‌లోకి నీరు చేరింది. రెండు రోజుల్లో కాలువల ద్వారా మర్కూక్‌లో నిర్మించిన పంపుహౌజ్‌కు నీరు చేరుకుంటుంది. అక్కడి నుంచి కొండపోచమ్మ జలాశయంలోకి గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు ఏర్పాట్లు పూర్తయాయి. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని నిర్మాణ విభాగం అధికారులు తెలిపారు. మర్కూక్‌లో సీసీ రహదారులను నిర్మిస్తున్నారు. నీటి పంపుల ద్వారా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.