ETV Bharat / state

విచిత్ర వేషధారణలతో...కరోనా కట్టడి ప్రచారం - కరోనాపై హుస్నాబాద్​లో కళాకారుల బృందం ప్రచారం

కొవిడ్​-19 కట్టడి కోసం పలు ప్రాంతాల్లో రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో ఓ కళాకారుల బృందం విచిత్ర వేషధారణలతో కరోనా వ్యాధి గురించి ప్రచారం చేశారు. ప్రధాన రోడ్లపై వచ్చిన వాహనదారులకు పలు సూచనలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు.

With the peculiar attire the corona tightening campaign at husnabad
విచిత్ర వేషధారణలతో...కరోనా కట్టడి ప్రచారం
author img

By

Published : Apr 12, 2020, 12:28 PM IST

కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో ఓ కళాకారుల బృందం వాహనదారులకు అవగాహన కల్పించారు. పోలీసులు, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రధాన కూడళ్లలో యమధర్మరాజు, చిత్రగుప్తుడు, కరోనా భూతం, భటుడి వేషాలలో రోడ్లపై వెళ్తున్న వారికి కొవిడ్​-19పై వివరించారు. అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావద్దన్నారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వచ్చిన వాహనాలను పోలీసులు సీజ్ చేశారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్​డౌన్ నిబంధనలను ప్రజలు కచ్ఛితంగా పాటించాలన్నారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దన్నారు. విచిత్ర వేషధారణలతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న కళాకారులను ఎస్సై సుధాకర్ అభినందించారు.

విచిత్ర వేషధారణలతో...కరోనా కట్టడి ప్రచారం

ఇదీ చూడండి : ఎగ్జిబిషన్​ మైదానంలో అన్నీ ఫ్రీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.