సిద్ధిపేట జిల్లా కేంద్రంలో బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా స్థాయి ప్రథమ సభలు జరిగాయి. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హారయ్యారు. దేశంలో మెుదటిసారిగా బీడీ కార్మికులకు జీవనభృతిని అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. బీడీలు చుట్టిన అనంతరం జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వచ్చే వ్యాధుల గురించి వివరించారు. మాస్క్‌లు ధరించి బీడీలు చుట్టాలని సూచించారు. త్వరలోనే సిద్ధిపేటలో అంబికా దర్బార్ బత్తి కంపెనీ తీసుకువస్తానని హామీ ఇచ్చారు.
ఇదీచూడండి:పులిచింతలలో మొసళ్ల హల్చల్