సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో భార్గవపురం సేవాసమితి ఆధ్వర్యంలో 1983-84 పదవ తరగతి బృంద సహకారంతో మున్సిపల్ కార్మికులకు, పట్టణంలోని పేద ప్రజలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ ఛైర్మన్ రజిత, వైస్ ఛైర్మన్ అనిత ప్రారంభించారు. భార్గవ పురం సేవాసమితి ఆధ్వర్యంలో 19 రోజులుగా దాతల సహకారంతో అన్నదానం చేస్తున్నామని నిర్వహకులు తెలిపారు. అలాగే అన్నదాన కార్యక్రమాన్ని లాక్డౌన్ ఉన్నన్ని రోజులు కొనసాగిస్తామన్నారు. ఈ సందర్భంగా భార్గవపురం సేవా సమితి సభ్యులను మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అభినందించారు.
'లాక్డౌన్ ఉన్నన్ని రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం'
లాక్డౌన్ నేపథ్యంలో కొంతమంది దాతలు పేదలకు, కార్మికులకు నిత్య అన్నదానం చేస్తూ తమ సేవా నిరతిని చాటుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు హుస్నాబాద్‌లో మున్సిపల్ కార్మికులతో పాటు పట్టణంలోని పేద ప్రజలకు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు భార్గవపురం సేవా సమితి సభ్యులు తెలిపారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో భార్గవపురం సేవాసమితి ఆధ్వర్యంలో 1983-84 పదవ తరగతి బృంద సహకారంతో మున్సిపల్ కార్మికులకు, పట్టణంలోని పేద ప్రజలకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ ఛైర్మన్ రజిత, వైస్ ఛైర్మన్ అనిత ప్రారంభించారు. భార్గవ పురం సేవాసమితి ఆధ్వర్యంలో 19 రోజులుగా దాతల సహకారంతో అన్నదానం చేస్తున్నామని నిర్వహకులు తెలిపారు. అలాగే అన్నదాన కార్యక్రమాన్ని లాక్డౌన్ ఉన్నన్ని రోజులు కొనసాగిస్తామన్నారు. ఈ సందర్భంగా భార్గవపురం సేవా సమితి సభ్యులను మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ అభినందించారు.
TAGGED:
free food distribution