గజ్వేల్ మండలం దిలాల్పూర్ మధిర గ్రామంలోని వడ్డెర కాలనీలో వడదెబ్బ తగిలి పాతిక మంది అస్వస్థతకు గురయ్యారు. ఇళ్ల ముందే కుప్పకూలిపోయారు. నడవలేని స్థితికి చేరుకోవడం వల్ల వారిని హుటాహుటిన గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరంతా నిత్యం రాళ్లు కొడుతూ జీవనం సాగిస్తున్నారు. ఎండవేడిమి కారణంగానే అనారోగ్యానికి గురయ్యారని వైద్యులు చెబుతున్నారు.
వారి నివాసాల చుట్టూ ఎత్తైన బండరాళ్లు ఉన్నాయి. వాటి వల్లనే ఎక్కువ వేడి వస్తుందని స్థానికులు చెబుతున్నారు. రోజురోజుకు ఉష్ణోగ్రత పెరిగిపోతుండడం వల్ల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. ఒకే గ్రామానికి చెందిన పాతిక మంది తీవ్ర అస్వస్థతకు గురికావడం వల్ల మండల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ముగిసిన నామినేషన్లు