ప్రతి ఒక్కరికీ కొవిడ్ టీకా ఇవ్వాలని... వ్యాక్సిన్‌పై ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అధికారులకు ఆదేశించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని సూచించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని పేర్కొన్నారు.
సిద్దిపేట జిల్లా విపంచి ఆడిటోరియంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ తీరుతెన్నులను మంత్రి పరిశీలించారు. సూపర్ స్పైడర్ల కోసం ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సంబంధిత రికార్డులు, వ్యాక్సినేషన్ అమలు తీరును గమనించారు. సెంటర్‌కు కేటాయించిన సిబ్బంది విధులకు హాజరయ్యారా? లేదా ? అధికారుల పర్యవేక్షణపై ఆరా తీశారు.
రోజుకు 300 నుంచి 400 మంది వ్యాక్సిన్ తీసుకోవడానికి వస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ కేంద్రం వద్ద తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. షుగర్ ఉన్న వారు కూడా వ్యాక్సిన్ వేసుకోవచ్చని ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. టీకా తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత మున్సిపాలిటీ మెప్మా ఆర్పీలదేనని మంత్రి స్పష్టం చేశారు. విపంచి కేంద్రంలో రోజుకు 2వేల మందికి వ్యాక్సిన్ వేయాలని అధికారులను ఆదేశించారు.
అంతకుముందు జిల్లాలోని వర్గల్ శ్రీ విద్యా సరస్వతి - శనైశ్చర ఆలయంలో జరుగుతున్న హోమం, పూజలో హరీశ్ పాల్గొన్నారు. అనంతరం శ్రీ సరస్వతీ దేవి అమ్మవారి దర్శించుకున్నారు. చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
ఇదీ చదవండి: Bonalu: భాగ్యనగరంలో బోనాల నిర్వహణపై మంత్రుల సమీక్ష