సిద్దిపేట జిల్లా ములుగులో నిర్మిస్తున్న కొండపోచమ్మ జలాశయాన్ని రాష్ట్ర అటవీ అభివృద్ధి శాఖ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) ఛైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి సందర్శించారు. జలాశయ నిర్మాణ పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం మానస పుత్రికైన కాళేశ్వరం ప్రాజెక్టునకు తుదిరూపు వచ్చిందని చెప్పారు. వచ్చే నెలలో కొండపోచమ్మ జలాశయంలోకి నీరు వచ్చే అవకాశాలున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల నిర్మాణాల కోసం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కృషి ఫలితంగా బీడు వారిన నేలలు సస్యశ్యామలంగా మారాయన్నారు.
ఇవీ చూడండి: రాష్ట్రంలో 800 మార్కు దాటిన కరోనా కేసులు