సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 52వ రోజూ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ ఉద్యోగులు పట్టణంలోని బస్ డిపో ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కార్మికులెవరూ మనోధైర్యాన్ని కోల్పోకుండా సమ్మెలో పాల్గొనాలని సూచించారు. 52 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
ఎలాంటి షరతులు లేకుండా కార్మికులందరినీ ఉద్యోగాల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలు పక్కనపెట్టి ఆర్టీసీ ప్రైవేటీకరణ చేయడం చాలా దారుణం అన్నారు. వెంటనే సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కార్మికులు కోరారు.
ఇవీ చూడండి: కాసేపట్లో రాజ్‌భవన్‌కు కేసీఆర్.. గవర్నర్‌తో భేటీ