రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల 31వ రోజు సమ్మెలో భాగంగా కార్మికులు దీక్ష చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక డిపో ఎదుట కార్మికులు చేస్తున్న ఆందోళనకు భాజపా, ఇతర పార్టీలు మద్దతు తెలిపాయి. సమ్మెను నిర్వీర్యం చేసేందుకు కార్మికులు విధుల్లో చేరుతున్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆర్టీసీ కార్మికులు ఆరోపించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేవరకూ పోరాడతామని కార్మికులు తెలిపారు.
ఇదీ చదవండిః సత్తుపల్లి డిపో ఎదుట బైఠాయించిన ఆర్టీసీ కార్మికులు