సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో తెరాస 21వ ఆవిర్భావ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు రామ్ రెడ్డి.. పార్టీ శ్రేణులతో కలిసి జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్రం.. దేశంలోనే అగ్రగామిగా నిలుస్తూ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు. పేదల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతున్న సీఎం కేసీఆర్‌పై ఎల్లప్పుడూ ప్రజల ఆశీర్వాదం ఉండాలని కోరారు.
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమ పార్టీగా ఏర్పడ్డ తెరాస.. ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధే ఎజెండాగా ముందుకు వెళ్తోందని రామ్ రెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ రజిత, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: 'ఎమ్మెల్యే గండ్ర నుంచి ప్రాణహాని ఉంది'