దుబ్బాకకు ఉప ఎన్నికలు రావడం దురదృష్టకరమని... ఇంత తొందరగా ఎన్నికలు వస్తాయని తాను ఎప్పుడూ ఊహించలేదని తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచారంలో... దివంగత నేత రామలింగారెడ్డి ఆశయాలను కొనసాగించేందుకు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు.
ఒక్కసారి తనకు అవకాశం ఇచ్చి అత్యధిక మెజార్టీతో గెలిపించాలంటూ భావోద్వేగంతో అభ్యర్థి సుజాత ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికలు రాగానే కాంగ్రెస్, భాజపా నాయకులు గ్రామాల్లోకి వస్తున్నారని.. మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. రామలింగారెడ్డి ఆశయాలను కొనసాగించేందుకు పుట్టెడు దుఖంతో మీ ముందుకు వచ్చిన సుజాతకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.