ETV Bharat / state

జహీరాబాద్​ బాద్​ షా బీబీ పాటిల్​

జహీరాబాద్ లోక్​సభ పోరులో తెరాస అభ్యర్థి బీబీ పాటిల్​ విజయం సాధించారు. కాంగ్రెస్​ అభ్యర్థి మదన్​ మోహనరావుపై 4,471 ఓట్ల తేడాతో గెలుపొందారు. తెరాస సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ఆ పార్టీ  నేతలు సఫలీకృతులయ్యారు. తనను నమ్మి గెలిపించిన జహీరాబాద్​ ప్రజలకు రుణపడి ఉంటానని బీబీ పాటిల్​ అన్నారు.

పాటిల్​ విజయం
author img

By

Published : May 23, 2019, 8:50 PM IST

జహీరాబాద్ పార్లమెంట్​లో తెరాస అభ్యర్థి బీబీ పాటిల్​ విజయం సాధించారు. కాంగ్రెస్​ అభ్యర్థి మదన్​ మోహన రావుపై 4,471 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఉదయం ఫలితం విడుదలైన మొదటి రౌండు నుంచి ఇదే ఆధిక్యాన్ని కనబరిచారు. వరుసగా రెండోసారి విజయాన్నందించిన జహీరాబాద్​ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

జహీరాబాద్​లో స్వల్ప ఆదిక్యంతో గెలిచిన బీబీపాటిల్​

సంక్షేమమే బలంగా

తెరాస ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు బీబీ పాటిల్. అవి కొనసాగాలంటే తెరాస గెలిస్తేనే సాధ్యమన్న వాదనను తెరాస ఎమ్మెల్యేలు బలంగా తీసుకెళ్లగలిగారు. లింగాయత్​ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం పాటిల్​కు కలిసొచ్చిన మరో అంశం.

పనిచేయని కాంగ్రెస్​ వ్యూహాలు

హస్తం పార్టీ నుంచి పోటీ చేసిన మదన్​ మోహన్​రావు గట్టి పోటీ ఇచ్చినా... ఫలితం లేకపోయింది. ప్రచారంలో వినియోగించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మదన్​ మోహన్​కు మేలు కలిగించలేకపోయింది. మైనార్టీ ఓటు బ్యాంకు, ఉపాధి కల్పనకు చేస్తున్న కార్యక్రమాలు సైతం జహీరాబాద్​ ఓటర్లపై ప్రభావం చూపలేకపోయాయి. 2014 ఎన్నికల్లో భాజపా మద్దతుతో తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన మదన్‌ మోహన్‌రావు అనంతరం కాంగ్రెస్​లో చేరి... పోటీ చేశారు.

పని చేయని మోదీ మానియా

జహీరాబాద్​లో భాజపా తరఫున పోటీ చేసిన లక్ష్మారెడ్డి మోదీ మానియాను నమ్ముకున్నప్పటికీ అది పనిచేయలేదు. ప్రచారంలో ప్రజల మనసు గెలుచుకోవడంలో విఫలమయ్యారు.

ఇదీ చూడండి : తెలంగాణలో గెలిచిన ప్రశ్నించే గొంతుక

Intro:హైదరాబాద్ అంబర్పేట్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది

Body:హైదరాబాద్ నారాయణగూడలోని రెడ్డి మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన అంబర్పేట నియోజకవర్గం ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది ఈ కౌంటింగ్ లో లో మొదటి రౌండ్ కు వచ్చేసరికి టిఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ కు ఒక వెయ్యి 546 ఓట్లు రాగా బిజెపి అభ్యర్థి జి కిషన్ రెడ్డి కి 5060 వచ్చాయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుమార్కు 774,, nota 106 ఓట్లు వచ్చాయి

Conclusion:అంబర్పేట్ నియోజకవర్గంలో ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా కొనసాగుతోంది
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.