సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ట్రైనీ ఐఏఎస్ దీపక్ తివారి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రిలో కొవిడ్-19 టెస్టుల నిర్వహణ, రోజుకు ఎన్ని టెస్ట్లు చేస్తున్నారనే అంశంపై ఆరా తీశారు.
మండలంలో కోవిడ్ ఉద్ధృతి ఎలా ఉంది.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, బాధితులకు ఎలాంటి చికిత్స అందిస్తున్నారనే అంశాలను గురించి వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. తనిఖీల్లో భాగంగా ఆస్పత్రి రికార్డులను పరిశీలించారు.
ఇదీ చూడండి: 'ఆరు నెలల్లో 175 వాయు నాణ్యత కేంద్రాలు!'