దుబ్బాక ఉపఎన్నికపై కాంగ్రెస్ ఇన్‌ఛార్జులతో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త తీవ్రంగా శ్రమించాలని సూచించారు. ప్రచారం ముగిసే వరకు ఓటర్లను కలిసే ప్రయత్నం చేయాలన్నారు. పోలింగ్ బూత్ ఏజెంట్లను రేపటిలోగా నియమించాలని ఆదేశించారు. మాజీమంత్రి ముత్యంరెడ్డి హయాంలోనే నియోజకవర్గం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. ఉపఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి చరిత్ర సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తెరాస, భాజపా అభ్యర్థుల కంటే కాంగ్రెస్ అభ్యర్థికే ప్రజల్లో ఆదరణ ఉందని తెలిపారు. రఘునందన్‌రావు గెలిచినా తెరాసలోకే వెళ్తారని ఆరోపించారు. నో ఎల్ఆర్ఎస్... నో టీఆర్‌ఎస్ అంశాన్ని ప్రజల్లోకి విసృతంగా తీసుకెళ్లాలని సూచించారు. తెరాస నేతలు విచ్చలవిడిగా మద్యం, డబ్బులను పంచుతున్నారని ఆరోపించారు.
ఇవీచూడండి: దుబ్బాకలో తెరాస, భాజపా నాటకాలు : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి