ETV Bharat / state

రైతులపై వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి : పొన్నం ప్రభాకర్ - సిద్దిపేట వార్తలు

దిల్లీలో ధర్నా చేస్తున్న రైతులను భాజపా నాయకులు కమీషన్​ ఎజెంట్లతో పోల్చడంపై టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సన్నం వరి వేసిన రైతులకు మద్దతు ధర చెల్లించకుండా తెరాస బంద్​లో పాల్గొనమేంటని ఆయన ప్రశ్నించారు. సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

TPCC Executive President Ponnam Prabhakar fire on central and state govt
రైతులపై వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి : పొన్నం ప్రభాకర్
author img

By

Published : Dec 9, 2020, 4:19 PM IST

రాష్ట్రప్రభుత్వం సన్నాలకు మద్దతు ధర చెల్లించకుండా బంద్​లో పాల్గొనడంపై దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ విమర్శించారు. దిల్లీలో ధర్నా చేస్తున్న రైతులను భాజపా నాయకులు కమిషన్​ ఎజెంట్లతో పోల్చడంపై ఆయన మండిపడ్డారు. అన్నదాతలపై అనుచిత వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్​ అధినేత సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్​లో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.

రాష్ట్రప్రభుత్వం సన్నవరికి బోనస్​ చెల్లిస్తే కేంద్రం ధాన్యం సేకరణ చేయబోదనడం అవాస్తవమన్నారు. కనీస మద్దతు ధర, పంటను నిల్వ చేసుకునేందుకు రైతులకు మాత్రమే హక్కులు ఉండేలా నూతన వ్యవసాయ చట్టాల్లో పొందుపరచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది సోనియా గాంధీనే అనే నినాదమే లక్ష్యంగా 2023 ఎన్నికల్లో అధికారం చేపడుతామని ధీమా వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్ష పదవి రేసులో తాను లేనని అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని పొన్నం తెలిపారు.

ఇదీ చూడండి:వరద బాధితులకు ఆర్థికసాయం ప్రక్రియ ప్రారంభం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.